మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు
- October 22, 2024
మచిలీపట్టణం: మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, 'పింగళి వెంకయ్య మెడికల్ కాలేజీ'గా ఏపీ ప్రభుత్వం పేరు మార్చింది. బీజేపీ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పలు విద్యాసంస్థలకు తమ ఇంట్లో వారి పేరు పెట్టుకుంటే.. తాము మాత్రం దేశ నాయకుల పేర్లు పెడుతున్నామని పేర్కొన్నారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టాలని వైసీపీ ప్రభుత్వ హయంలోనే విజ్ఞప్తులు వచ్చాయి. కానీ జగన్ సర్కార్ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్య పేరును నిర్ణయించిన సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







