అనసూయ వెర్సస్ మంచు లక్ష్మి.! దీపావళికి ‘మోత మోగిపోద్ది’.!
- October 22, 2024
అనసూయ, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో సినిమా ఏమైనా రాబోతోందా.? అనుకుంటున్నారా.? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. నిజానికి అనసూయ సినిమాలతో చాలా బిజీగా వున్న సంగతి తెలిసిందే.
అలాగే, మంచు లక్ష్మి ‘ఆది పర్వం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ‘యక్షిణి’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించింది.
అసలు మ్యాటర్ ఏంటంటే, అనసూయ, మంచు లక్ష్మి కలిసి ఓ బుల్లితెర స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. దీపావళికి ప్రసారం కాబోయే ఈ ప్రోగ్రాంలో అనసూయ ‘అను బాంబ్’గా, మంచు లక్ష్మి ‘లక్ష్మి బాంబ్’ అంటూ రెండు టీమ్‌లుగా విడిపోయి తమ తమ టీమ్స్ కోసం నువ్వా నేనా.? అంటూ పర్‌ఫామెన్స్ ఇవ్వబోతున్నారు.
తాజాగా ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ప్రోగ్రాంలో మంచు లక్ష్మి వెర్సస్, అనసూయ మధ్య డైలాగులు మాస్ కా దాస్ అనేలా హోరెత్తిపోతున్నాయి. దాంతో, ఈ ప్రోగ్రామ్‌పై ఆసక్తి పెరిగింది.
గతంలోనూ ఈ తరహా ప్రోగ్రామ్స్ బుల్లితెరపై వీక్షకుల్ని ఎంటర్టైన్ చేసేవి. తాజాగా దీపావళికి రాబోయే ఈ ‘మోత మోగిపోద్ది’ ప్రోగ్రామ్ ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్ చేయనుందో తెలియాలంటే దీపావళి వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







