ప్రబాస్ కల్కి కన్నా ముందే ‘శంబాల’ చూపించేస్తారట.!
- October 22, 2024
ఇటీవల ప్రబాస్ నటించిన ‘కల్కి’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాశీ, కాంప్లెక్స్, శంబాల అనే మూడు పేర్లు వినిపించాయ్.
‘కల్కి’లో చూపించిన ‘శంబాల’ సంగతి దాదాపు ‘కల్కి’ సినిమా చూసినవాళ్లందరికీ తెలుసు. అయితే, ఇప్పుడు ఆది సాయి కుమార్ మరో ‘శంబాల’ని చూపించబోతున్నాడు.
‘శంబాల’ పేరుతో ఆది ఓ సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్ నేచురల్ పవర్స్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా వుండబోతోందనీ మేకర్లు ప్రకటించారు.
‘ఏ’ అనే ఓ డిఫరెంట్ మూవీతో పరిచయమైన యుగంధర్ ఈ సినిమాకి దర్శకుడు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఓ పాడుబడిన ఊరు, ఆకాశంలో భయానకమైన ఓ ఆకారం, ప్రళయానికి సంకేతం అన్నట్లుగా ఆకాశం నుంచి రాలి పడుతున్న ఉల్కలు.. భయంకరంగా కనిపిస్తున్న చుట్టూ పరిస్థితి. భీకరం, భయానకం అన్నట్లుగా వున్న ఆ ఊరిలో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు.
ఇదీ ఈ పోస్టర్ పరిస్థితి. పోస్టర్ ఆసక్తికరంగా వుంది. సినిమా మరింత ఆసక్తికరంగా వుండబోతోందట. ఈ సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తోందట. విజువల్స్ న భూతో న భవిష్యతి అనేలా వుండబోతున్నాయని చెబుతున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ‘జాంబి రెడ్డి’ ఫేమ్ ఆనంది, ఆదికి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







