ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికీకరణ చట్టం.. ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!

- October 23, 2024 , by Maagulf
ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికీకరణ చట్టం.. ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!

దోహా: ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలను స్థానికీకరించడంపై చట్టాన్ని ఉల్లంఘించిన సంస్థలు లేదా వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, QR1,000,000 వరకు జరిమానా విధించనున్నట్లు న్యాయ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.  చట్టంలోని ఆర్టికల్ (11) ప్రకారం.. నిర్ణీత వ్యవధిలో ఉల్లంఘనను సరిచేసుకోని సంస్థల లావాదేవీలను 3 నెలల కాలానికి రద్దు చేస్తారు. ఆర్టికల్ (12) ప్రకారం.. మోసపూరిత విధానాలకు పాల్పడే వారికి 3 సంవత్సరాల జైలుశిక్షతోపాటు QR1,000,000కు జరిమానా విధించనున్నట్లు మంత్రిత్వశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. లోకలైజేషన్ చట్టం ప్రకారం.. అందుబాటులో ఉన్న ఉద్యోగాల గురించి తెలియజేయకపోవడం, నియమించిన వారి డేటాను అధికారులకు అందించకపోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే మొదటిసారి ఉల్లంఘన జరిగినప్పుడు QR10,000, రెండవసారి జరిగినప్పుడు QR 20,000, మూడోసారి జరిగితే QR30,000 జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా పునరావాసం, శిక్షణా ప్రణాళికకు కట్టుబడి ఉండని పక్షంలో మొదటి సారి పెనాల్టీ QR50,000, రెండవ ఉల్లంఘనకు QR75,000, మూడవసారి జరిగితే QR100,000 ఫైన్ విధిస్తారు. ఈ చట్టం అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన తేదీ నుండి ఆరు నెలల తర్వాత అమలులోకి వస్తుందని వెల్లడించింది. ఈ చట్టం ఖతార్ జాతీయ విజన్ 2030కి అనుగుణంగా తీసుకొచ్చినట్లు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com