BD1మిలియన్ ఫ్రాడ్.. కంపెనీ మేనేజర్ కు 5ఏళ్ల జైలుశిక్ష..!!
- October 23, 2024
మనామా: BD1 మిలియన్ కంటే ఎక్కువ అక్రమ లావాదేవీలలో మోసానికి పాల్పడిన మనీ ఎక్స్ఛేంజ్ కంపెనీ మేనేజర్‌కు ఐదేళ్ల జైలు శిక్షను కోర్టు ఆఫ్ కాసేషన్ సమర్థించింది. బాబ్ అల్ బహ్రెయిన్ బ్రాంచ్‌లో పనిచేసిన మేనేజర్.. నకిలీ ఖాతాదారుల పేర్లను ఉపయోగించి అంతర్జాతీయ నగదు బదిలీలను ప్రాసెస్ చేయడానికి BD5,100 లంచం అందుకున్నాడు. అతనికి సహకరించిన ఇద్దరు సహచరులకు మూడేళ్ల జైలుశిక్షతోపాటు బహిష్కరణ వేటు వేయనున్నారు. 2021 -23 మధ్య కాలంలో మేనేజర్ లంచాలు స్వీకరించారని, అతని విధులను ఉల్లంఘించారని, కంపెనీ సిస్టమ్‌లో తప్పుడు డేటాను నమోదు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అతని సహచరులపై లంచం, కుట్ర అభియోగాలు మోపారు. ఒక సహచరుడు BD4,500 లంచం కోసం సుమారు BD1 మిలియన్ మొత్తం 587 లావాదేవీలను చేసాడని, మరొకడు BD600 లంచం కోసం BD100,000 విలువైన 78 బదిలీలను ప్రాసెస్ చేశాడని గుర్తించారు. మోసపూరిత కార్యకలాపాలతో తాము పని చేస్తున్న సంస్థకు గణనీయమైన నష్టాన్ని కలిగించారని ఆరోపించారు. ప్రాథమిక కోర్టు తీర్పును హైకోర్టు గతంలో ధృవీకరించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







