సౌదీ అరేబియాలో జనవరి నుండి ‘టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌’ అమలు..!!

- October 24, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో జనవరి నుండి ‘టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌’ అమలు..!!

రియాద్: సౌదీ మార్కెట్‌లో మొబైల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం యూనిఫైడ్ ఛార్జింగ్ పోర్ట్‌ల తప్పనిసరి మొదటి దశ.. జనవరి 1, 2025 నుండి అమలులోకి వస్తుందని సౌదీ అధికారులు ప్రకటించారు. దీనికి "USB టైప్-సి"ని ఉపయోగించడం తప్పనిసరి చేశారు.  కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) మరియు సౌదీ స్టాండర్డ్స్, మెట్రాలజీ అండ్ క్వాలిటీ ఆర్గనైజేషన్ (SASO) ఉత్తర్వులను జారీ చేసింది.  సౌదీ అరేబియాలో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం, వినియోగదారులకు అదనపు ఖర్చులను తగ్గించడం, అధిక-నాణ్యత ఛార్జింగ్ డేటాను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సహంతోపాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (SDGలు) సాధించడంలో దోహదపడుతుందని వెల్లడించింది.

యూనిఫైడ్ ఛార్జింగ్ పోర్ట్‌ల అమలు వల్ల మొబైల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఛార్జింగ్ పోర్ట్‌ల స్థానిక వినియోగం ప్రతి సంవత్సరం 2.2 మిలియన్ యూనిట్లకు పైగా తగ్గుతుందని తెలిపింది. సౌదీ అరేబియాలో సంవత్సరానికి దాదాపు 15 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడం ద్వారా కింగ్‌డమ్ సుస్థిరత లక్ష్యాలకు మద్దతునిస్తూ సౌదీ అరేబియాలో వినియోగదారులకు SR170 మిలియన్ల కంటే ఎక్కువ ఆదా అవుతుందని భావిస్తున్నారు. మొదటి దశలో మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, డిజిటల్ కెమెరాలు, ఇ-రీడర్‌లు, పోర్టబుల్ వీడియో గేమ్ కన్సోల్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, పోర్టబుల్ స్పీకర్లు, యాంప్లిఫైడ్ స్పీకర్లు, కీబోర్డులు, కంప్యూటర్ మైస్, అలాగే పోర్టబుల్ నావిగేషన్ సిస్టమ్‌లు, వైర్‌లెస్ రూటర్లు ఉంటాయి. రెండవ దశ ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభమవుతుందని కమిషన్ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com