‘క’.! కిరణ్ అబ్బవరం విశ్వరూపమే.!
- October 26, 2024
సాప్ట్వేర్ ఉద్యోగం వదులుకుని సినిమాలపై ఆసక్తితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్‌స్టర్ కిరణ్ అబ్బవరం. తొలి సినిమా ‘రాజా వారు రాణి వారు’తో సమ్‌థింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు.
ఆ తర్వాత వరుసగా వచ్చిన ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ తదితర సినిమాలతో యూత్‌లో మంచి స్టార్డమ్ తెచ్చుకున్నాడు.
హిట్, ఫట్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే వున్నాడు. ఒక్కొక్కటిగా విడుదలవుతూనే వున్నాయవి.
తాజాగా మనోడు ‘క’ అనే ప్యాన్ ఇండియా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ వారం అనగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇంతవరకూ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ఈ సినిమాని ఓ కూల్ మూవీగా ప్రెజెంట్ చేస్తే.. ట్రైలర్ అసలు విషయాన్ని బయట పెట్టింది.
ట్రైలర్ కట్ చేసిన విధానం చాలా బాగుంది. మొదట కూల్‌గా స్టార్ట్ చేసి, ‘వీడు కనించేంత మంచోడేం కాదు..’ అంటూ కిరణ్ అబ్బవరం ఫ్లాష్ బ్యాక్‌పై ఆసక్తి పెంచేలా కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కట్ చేశారు.
డిఫరెంట్ వేరియేషన్స్‌లో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడనీ ట్రైలర్ ద్వారా అర్దమవుతోంది. బీభత్సమైన యాక్షన్, రక్తపాతం సృష్టించబోతున్నాడీ పోస్ట్‌మాన్. అసలు ఈ పోస్ట్’మాన్ వెనక ఆ ఇంట్రెస్టింగ్ అండ్ వయలెంట్ కథేంటో తెలియాలంటే అక్టోబర్ 31 వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







