కళామతల్లి ‘వర ప్రసాదం’ చిరంజీవికి 50 ఏళ్లు.!
- October 26, 2024
అదేంటీ చిరంజీవి వయసు 50కి తగ్గిపోయిందా.? అనుకుంటున్నారా.? కళామతల్లికి చిరంజీవి అనే వరప్రసాదం దొరికి 50 ఏళ్లు పూర్తయ్యింది.
అదేనండీ మెగాస్టార్ చిరంజీవి నట ప్రస్థానానికి 50 ఏళ్లన్నమాట. తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ, చిరంజీవి తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ ఫోటో పోస్ట్ చేశారు.
బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్న రోజుల్లోని ఫోటో అది. కాలేజీ ఫంక్షన్లో భాగంగా వేసిన రంగస్థల నాటకంలో ఉత్తమ నటుడి బహుమతి అందుకున్న ఫోటో అది.
అప్పటి నుంచే చిరంజీవి నట ప్రస్థానం మొదలయ్యింది. అలా ఇప్పటి వరకూ కొనసాగుతూనే వుంది. కళామతల్లికి అప్పుడు దొరికిన వర ప్రసాదమే ఈ కొణిదెల శివ శంకర వర ప్రసాద్ రావు.
సోషల్ మీడియాలో చిరంజీవి పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పేరుకు తగ్గట్లుగానే నిజమైన కళామతల్లి వర ప్రసాదం ఆయన అంటూ ఈ పోస్ట్‌కి లైకులూ, షేర్లూ పోటెత్తుతున్నాయ్.
మరోవైపు చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







