'చిరు' 150వ చిత్ర షూటింగ్ ప్రారంభ
- June 23, 2016
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కల నేటితో నెరవేరింది. గురువారం ఆయన నటిస్తున్న 150వ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తనయుడు రామ్‌చరణ్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. స్మార్ట్‌లుక్‌తో చిరంజీవి ఈ ఫొటోల్లో కనిపిస్తున్నారు. 'నా ప్రతి పనికి నాన్న ఎప్పుడూ మద్దతుగానే నిలుస్తారు. నాన్న చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని చెర్రీ అన్నాడు. ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులు చేసిన దానికి రుణం తీర్చుకోవాలని అనుకుంటారు.. ఆ సమయం నాకు ఇప్పుడు వచ్చింది.. నా తండ్రితో నా ప్రొడక్షన్ ప్రారంభమైందంటూ' ఎంతో చెప్పుకొచ్చాడు.
చిరు 150వ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఠాగూర్' చిత్రం ఘన విజయం సాధించింది. తమిళంలో విజయ్ నటించిన 'కత్తి' చిత్రం రీమేక్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







