రమదాన్ మాసం లో కూడా మద్యం లభ్యం
- June 23, 2016
పవిత్ర రమదాన్ మాసంలో తమ దేశానికి వచ్చే టూరిస్టులకు నోరూరించే వార్త చెప్పింది దుబాయ్ టూరిజం డిపార్ట్‌మెంట్. చరిత్రలో తొలిసారిగా మద్యం అమ్మకాలపై ఉన్న నిబంధనలను సడలించింది. రమదాన్ మాసం ముగిసేవరకు పగలు కూడా మద్యం అమ్ముకోవచ్చని దేశంలోని హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లకు అనుమతిచ్చింది. టూరిస్టులు, ఆల్కహాల్ ట్యాక్స్ తమ ఆదాయాన్ని భారీస్థాయిలో పెంచుతారని ఆశిస్తున్న అక్కడి టూరిజం డిపార్ట్‌మెంట్ విచ్చలవిడి మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపింది. గతంలో ఎవరైనా మద్యం సేవించాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈ నెల రోజులు మాత్రం ఎప్పుడుపడితే అప్పుడు మందు అందుబాటులో ఉండనుంది.
అయితే పవిత్ర రమదాన్ మాసంలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మసలుకోవాలని పర్యాటకులకు సూచించింది. రమదాన్ మాసం ముగిసేవరకు కనీసం పది లక్షల మంది టూరిస్టులు దుబాయ్ వస్తారని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. తమ పక్కనే ఉన్న సౌదీఅరేబియా, కువైట్, షార్జాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉండగా.. దుబాయ్‌లో మాత్రం ఉన్న నిబంధనలను కూడా సవరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీర్‌పై 30 శాతం మున్సిపాలిటీ ట్యాక్స్, మద్యంపై 50 శాతం దిగుమతి పన్నులాంటివి ఉండటంతో వీటి అమ్మకాలను పెంచడం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని దుబాయ్ భావిస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







