డ్రాగన్ ఫ్రూట్ ను ఈ సమస్యలు ఉన్న వాళ్ళు తినకూడదు
- November 01, 2024
డ్రాగన్ ఫ్రూట్ ఇండియా మార్కెట్‌లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా దొరుకుతుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు.ఇవి తినడానికి రుచిగా, మృదువుగా ఉంటాయి. ఇక, డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి మంచి పోషకాహారం. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌తో జెల్లీలు, సలాడ్స్, కేకులు, ఐస్ క్రీమ్‌లు, జ్యూసులు తయారు చేస్తారు. ఈ పండును పిటాయా, స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు.
డ్రాగన్ ఫ్రూట్ పోషకాల స్టోర్ హౌస్ అని చెప్పాలి. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్, ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల.. మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా.. బి1, బి2, బి3 విటమిన్లు కూడా ఈ పండులో ఉన్నాయి. తరచూ మన డైట్‌లో డ్రాగన్ ఫ్రూట్ చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు నిపుణులు. అయితే, ఎన్నో లాభాలున్నప్పటికీ.. ఈ పండు కొందరికి విషంతో సమానం. ఈ డ్రాగన్ ఫ్రూట్ ను కొందరు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఈ పండును ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
చర్మ సంబంధిత సమస్యలు, అలెర్జీతో బాధపడేవారు.. ఈ పండుకు దూరంగా ఉండాలి. ఈ పండు అతిగా తింటే అలర్జీ వచ్చే ప్రమాదముంది. ఈ పండు తినేటప్పుడు కొందరు.. తొక్క కూడా తింటారు. దీంతో.. దురదతో బాధపడతారు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణమవ్వడానికి కాస్త టైం పడుతుంది. దీంతో.. ఉబ్బరం సమస్యలు ఉన్నవారు.. దీనిని ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా తినడం వల్ల విరోచనాల సమస్య, డయేరియాకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తినకపోవడమే బెటర్. మీకు తినాలిపిస్తే వైద్యుణ్ని సంప్రదించాలి. అంతేకాకుండా.. ఇతర వ్యాధులకు మందులు తీసుకుంటున్నవారు కూడా డ్రాగన్ ఫ్రూట్ తినే విషయంలో డాక్టర్‌ని సంప్రదిస్తే మంచిది.
- డి.వి.అరవింద్
తాజా వార్తలు
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్
- BRICS శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా
- UAEలో 2027లో పబ్లిక్ హాలిడేలలో భారీ మార్పు.. 2026తో పోలిస్తే తగ్గనున్న సెలవులు
- హెచ్-1బీ వీసాదారులకు భారీ షాక్
- కూరగాయల మార్కెట్‌లో మద్యం బాటిళ్లు స్వాధీనం..!!







