డిజాబో యాప్ షట్ డౌన్.. లక్షలాది దిర్హామ్‌లను కోల్పోయిన ఇన్వెస్టర్లు..!
- November 01, 2024
యూఏఈ: యూఏఈలోని వందలాది మంది పెట్టుబడిదారులకు Dizabo Superapp ఒకప్పుడు లాభాలను తెచ్చిపెట్టింది. కేవలం ఆరు నెలల్లో 80 శాతం వరకు రాబడి అందించి ఇన్వెస్టర్లను ఆకర్షించింది. సెప్టెంబరు 2021లో ప్రారంభమైన Dizabo మిలియన్ల మంది వినియోగదారులతో వేలాది మంది విక్రేతలను కనెక్ట్ చేయడం ద్వారా ఇ-కామర్స్ లో మొదటి సూపర్ యాప్ గా గుర్తింపు పొందింది.
అయితే, నేడు దాని కథ ముగిసింది. యూఏఈ, GCC అంతటా పెట్టుబడిదారుల జేబులను ఖాళీ చేసింది. కంపెనీ ఆస్తులు, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. దాని కార్యాలయాన్ని ఆర్థిక , పర్యాటక శాఖ సీజ్ చేసింది. దాని వ్యవస్థాపకుడు, దక్షిణ భారతదేశానికి చెందిన 33 ఏళ్ల అబ్దుల్ అఫ్తాబ్ పల్లిక్కల్.. దుబాయ్ కోర్టులలో అనేక కేసులను ఎదుర్కొంటున్నారు.
Dizabo ఒక ఆఫర్‌తో పెట్టుబడిదారులను ఆకర్షించింది. Dh43,000 ప్రారంభ పెట్టుబడితో ఐదు డెలివరీ బైక్‌లను లీజుకు తీసుకోవచ్చు. ఒక్కొక్కటి Dh10,000 చొప్పున ఆరు పోస్ట్-డేటెడ్ చెక్‌లను మద్దతుగా.. 80 శాతం రాబడిని వాగ్దానం చేసింది. ఆరు నెలల్లోనే Dh43,000ని Dh60,000గా మార్చింది. పెద్ద పెట్టుబడిదారులు నాలుగు డెలివరీ వ్యాన్ల కోసం Dh200,000 పెట్టుబడి పెట్టవచ్చని, అదే తీరుగా అధిక రాబడి ఉంటుందని తెలిపింది. 2023లో చెల్లింపులను అకస్మాత్తుగా నిలిపివేసింది. ప్లాట్‌ఫారమ్ మరింత మెరుగైన రాబడిని ఇచ్చేందుకు యత్నిస్తుందని పెట్టుబడిదారులకు భరోసా కల్పించింది. కానీ ఇవేవి సత్ఫలితాలు ఇవ్వలేదు. అబ్దుల్ అఫ్తాబ్ తప్పించుకు తిరిగాడు. బాధిత ఇన్వెస్టర్లు సమావేశాలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అఫ్తాబ్ దుబాయ్ కోర్టులలో అరెస్ట్ వారెంట్లతో సహా పలు కేసులను ఎదుర్కొంటున్నట్లు పెట్టుబడిదారులు పంచుకున్న పత్రాలు వెల్లడిస్తున్నాయి. చివరకు స్థానిక అధికారులు కంపెనీని మూసివేశారు. ఇన్వెస్టర్లు లక్షలాది దిర్హామ్‌లు నష్ట పోయారు. కాగా, నష్టపోయిన ఇన్వస్టర్ల ఖచ్చితమైన సంఖ్య ఇంకా తెలియలేదు.
Dh200,000 పెట్టుబడి పెట్టిన భారతీయ ప్రవాస జుబేర్ మహమూద్.. బౌన్స్ అయిన చెక్కులు, బ్యాంకులు రుణదాతల కేసులను ఎదుర్కొంటున్నాడు. నా జీవితం రోజువారీ పోరాటం. నా తల్లికి క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేయించాలి. దాని కోసం మేము మా పూర్వీకుల ఆభరణాలను విక్రయించాల్సి వచ్చిందని ఖలీజ్ చెప్పారు. ఆర్థికంగా నష్టపోయిన. ఒత్తిడితో చేస్తున్న ఉద్యోగంపై ప్రభావం పడింది. అప్పుల కారణంగా ప్రయాణ నిషేధం విధించారు. ఇది నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని వాపోయారు. ఇలా అనేక మంది ఇన్వెస్టర్లు అందులో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారని నిపుణలు తెలిపారు. అదే సమయంలో కేసులు పెట్టొద్దని కంపెనీ బెదిరించినట్లు బాధితులు వెల్లడించారు.
కాగా, అఫ్తాబ్ తాను పెద్ద కంపెనీలకు రైడర్లను కోల్పోయినట్లు పేర్కొన్నా. తాను పోంజీ స్కీమ్‌ను నడుపుతున్నానన్న ఆరోపణలను తిరస్కరించాడు. తాను కేవలం స్టార్టప్‌ని మాత్రమే ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని అధిగమిస్తానని పేర్కొన్నాడు. తమతో సైన్ అప్ చేసిన 897 రెస్టారెంట్ల నుండి 18 మిలియన్ దిర్హామ్‌లను రికవరీ చేయాల్సి ఉందన్నారు. అయితే, డిజాబోకు ఎలాంటి డబ్బు బకాయిలు లేవని రెస్టారెంట్లు చెబుతుండటం గమనార్హం.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







