'బ్రహ్మా ఆనందం' నుంచి బ్రహ్మానందం గా రాజా గౌతమ్ ఫస్ట్ లుక్ రిలీజ్
- November 01, 2024
హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్‌టైనర్ 'బ్రహ్మా ఆనందం'లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఫస్ట్-టైమర్ RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు.
మేకర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రహ్మానందం గా రాజా గౌతమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రాజా గౌతమ్ ట్రెడిషనల్ అవతార్‌లో కనిపించిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. పర్ఫెక్ట్ దీపావళి ట్రీట్ గా నిలిచింది.
స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్100% సక్సెస్ రేట్‌తో న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తోంది. వారి గత చిత్రాలు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందించాయి. 'బ్రహ్మా ఆనందం' మరో యూనిక్ ఎంటర్ టైనర్ కానుంది.
ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుండగా, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాండిల్య పిసాపాటి మ్యూజిక్ అందిస్తున్నారు. మితేష్ పర్వతనేని డీవోపీ గా పని చేస్తున్నారు. ప్రసన్న ఎడిటర్.
2025 ఫిబ్రవరి 7న బ్రహ్మా ఆనందం విడుదల కానుంది.
తారాగణం: రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని. ఐశ్వర్య హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: RVS నిఖిల్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్
DOP: మితేష్ పర్వతనేని
సంగీతం: శాండిల్య పీసపాటి
ఎడిటర్: ప్రసన్న
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి దయాకర్ రావు
పీఆర్వో : వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: మాయాబజార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







