ఈ సమస్యలు ఉన్న వారు చపాతీలు తీసుకోకపోవడం మంచిది
- November 02, 2024
అన్నం బదులు చపాతీలు తినడం అనేది బరువు తగ్గడంలో ఒక భాగమైంది. దీని వల్ల కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి. బరువు కూడా తగ్గుతారని ఫీల్ అవుతారు. వీటిని రెగ్యులర్‌గా తింటే హెల్ప్ ఉంటుందని అనుకుంటారు. అయితే, వీటిని తినడం వల్ల బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయో.. మరోవైపు సమస్యలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎక్కువగా చపాతీలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.దీంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ చపాతీలు తీసుకోకపోవడమే మంచిదని కూడా చెబుతున్నారు.
చపాతీల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటిని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సంగతి పక్కన పెడితే మరింత బరువు పెరుగుతారు. ఇందులోని గ్లూటెన్ పరిమాణం కారణంగానే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరుగుతారు. వీటిలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తతీసుకోవడం సీలియక్ డిసీజ్ అంటే కడుపుకి సంబంధించిన సమస్యలొస్తాయి. దీని వల్ల అసిడిటీ, మలబద్ధకం, జీర్ణ సమస్యలొస్తాయి. దీనికి కారణం రోటీలు తిన్నప్పుడు వాత సమస్య పెరగడమే. కాబట్టి, జీర్ణ సమస్యలు ఉన్నవారు రోటీలను తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.
థైరాయిడ్ ఉన్నవారు గోధుమలు తీసుకోకపోవడమే మంచిది. గోధుమల్లోని గ్లూటెన్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతో థైరాయిడ్ సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి, జాగ్రత్త. అదే విధంగా, మనం నీరసంగా అలసిపోయి ఉన్నప్పుడు వీటిని తినడం వల్ల మరింత నీరసం అనిపిస్తుంది. రోటీల్లోని కార్బోహైడ్రేట్స్ అలసటని పెంచుతాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది. కొంతమందికి వీటిని తిన్నా ఆకలి తీరదు.
షుగర్ ఉన్నవారు రోటీలు తింటారు. అయితే, వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బీపి పెరుగుతుంది. దీంతో షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి. దీంతోపాటు, కొంతమందికి బాడీ సహజంగానే వేడిగా ఉంటుంది. అయితే, అలాంటివారు రోటీలు తింటే బాడీలో మరింత ఎక్కువగా వేడి ఉత్పత్తి అవుతుంది. నీటి శాతం తగ్గుతుంది. దీంతో మరిన్ని సమస్యలు పెరుగుతాయి.
చపాతీలు మంచివే అయినప్పటికీ, ఎక్కువగా తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, వీటిని మోతాదులో తీసుకోవాలి. ముఖ్యంగా, రోజుకి రెండు చపాతీలు అందులో ఎక్కువగా ఫైబర్ ఉండే కూరగాయలు ఉండేలా చూసుకోండి. పైగా అలర్జీలు ఉన్నవారు ఆ చపాతీలు తినడం కూడా తగ్గిస్తే లేదా మానేస్తే మంచిది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







