కమల్ హాసన్, శివకార్తికేయన్ 'అమరన్' టీంని ప్రశంసించిన సూపర్ స్టార్ రజనీకాంత్
- November 02, 2024
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి నేషన్ ప్రైడ్ బ్లాక్ బస్టర్ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R.మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు.
నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు.దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ 'అమరన్' చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు.
ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన రజనీకాంత్.. సినిమాని నిర్మించిన తన మిత్రుడు కమల్‌హాసన్‌కు ఫోన్ చేసి అభినందించారు.అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అలాగే, హీరో శివకార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్ , నిర్మాత ఆర్. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయి లని ప్రత్యేకంగా కలిశారు. సినిమా కథ, కథనం, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వున్నాయని టీమ్ అందరినీ ప్రశంసించారు.
అమరన్ యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







