ఒమన్ లో దీపావళి.. రంగురంగుల లైట్లతో వెలుగొందిన భారత ప్రవాసుల నివాసాలు..!!
- November 03, 2024
మస్కట్: దీపావళిని పురస్కరించుకుని ఒమన్ లోని ప్రవాస భారతీయులు తమ నివాసాలను రంగురంగుల లైట్లు, పువ్వులతో అలకరించుకొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. దీపాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ముఖ్యంగా రూవీలో నివాసితులు ఒకరినొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, రుచికరమైన వంటకాలను షేర్ చేసుకోవడంతో పండుగను ఆత్మీయంగా జరుపుకున్నారు. ఒమన్‌లోని ఆభరణాలు, స్వీట్ షాప్‌లు భారతీయులతో సందడి నెలకొన్నది. "ఈ సంవత్సరం, మేము దీపావళిని జరుపుకోవడానికి కొంతమంది స్థానిక స్నేహితులతో కలిసి వచ్చాము" అని వికీ అనే ప్రవాస భారతీయుడు తెలిపారు. మరో ప్రవాసుడు సూర్య కుమార్ మాట్లాడుతూ.. “మేము ఈ వేడుకను మా కుటుంబ స్నేహితులతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. దీపావళి పార్టీని ఏర్పాటు చేసాము. మేము కూడా సమీపంలోని ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేసాము.’’ అని చెప్పారు. మస్కట్‌లో ఒంటరిగా నివసించే దక్షిణ భారత ప్రవాసుడు మోహన్‌లాల్ మాట్లాడుతూ.. " ఈ సమయంలో మా కుటుంబాన్ని మేము నిజంగా మిస్ అవుతున్నాము." అని ఎమోషనల్ అయ్యారు. ఖురమ్ నివాసి అవినాష్ మాట్లాడుతూ.. “దీపావళి అంటే మేము సన్నిహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం. నేను వంట చేయడం ఆనందించాను . దీపావళి నేపథ్యంతో గజర్ కా హల్వా, మసాలా కాజు, ఘుద్ కి మిథాయ్, ఫ్రెష్ మావా (బర్ఫీ కోసం), ఇంటికి నాన్ ఖతై వంటి వంటకాలను సిద్ధం చేసాను.’’ అని తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







