ఆగ్రోటూరిజం స్కీమ్.. యూఏఈ వ్యవసాయ క్షేత్రాల్లో సందర్శకుల సందడి..!!

- November 05, 2024 , by Maagulf
ఆగ్రోటూరిజం స్కీమ్.. యూఏఈ వ్యవసాయ క్షేత్రాల్లో సందర్శకుల సందడి..!!

యూఏఈ: యూఏఈ వ్యవసాయ క్షేత్రాల్లో సందర్శకులు సందడి చేయనున్నారు. గత నెలలో ప్రారంభించిన ప్లాంట్ ది ఎమిరేట్స్ కార్యక్రమంలో భాగంగా ఆగ్రోటూరిజం స్కీమ్ ను ప్రవేశపెట్టారు. మల్టీ వ్యవసాయ క్షేత్రాలతో పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoCCAE) భాగస్వామిగా ఉంటుందని MoCCAE అండర్ సెక్రటరీ మహమ్మద్ సయీద్ సుల్తాన్ అల్ నుయిమి తెలిపారు. “యూఏఈ తన ఆహార సరఫరాను ఎలా పెంచుతోందో ప్రజలకు.. విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. యూఏఈలో కొన్ని అద్భుతమైన స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించడం, ఉత్పత్తి చేయడం వంటి వాటిపై సందర్శకులకు రైతులు అవగాహన కల్పిస్తారు. ఇది రైతులకు కూడా మేలు చేస్తుంది." అని వివరించారు. అగ్రోటూరిజం డ్రైవ్ ప్రతి ఎమిరేట్‌కు చేరుకుంటుందని, స్థానిక రైతులతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుందని, రాబోయే సీజన్ వరల్డ్స్ కూలెస్ట్ వింటర్ క్యాంపెయిన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని  అల్ నుయిమి చెప్పారు. ఎడారిలో మొక్కలను పెంచడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేకమైన ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించి, దేశంలోని రైతులు స్ట్రాబెర్రీ నుండి గోధుమలు మరియు కుంకుమపువ్వు వరకు ప్రతిదీ పండిస్తున్నారని, ఇది సందర్శకులకు వ్యవసాయంపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతుందని తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com