నవంబర్ 10న దుబాయ్ రైడ్.. పాల్గొనేవారికి ఉచితంగా అద్దె బైకులు..!!
- November 07, 2024
దుబాయ్: బైక్ షేరింగ్ కంపెనీ కరీం(Careem) నవంబర్ 10న జరిగే దుబాయ్ రైడ్‌లో పాల్గొనే నివాసితులు, పర్యాటకులకు ఉచితంగా అద్దె బైకులను అందించడానికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
దుబాయ్ రైడ్..వయస్సు లేదా సామర్థ్యంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. దుబాయ్ రైడ్ మార్గాలు ఉదయం 5 గంటలకు ప్రజలకు ప్రారంభమవుతాయి. సైక్లిస్టులు తమ ప్రయాణాన్ని ఉదయం 6.15 గంటలకు ప్రారంభించి ఉదయం 8 గంటలకు ముగిస్తారు. సైక్లింగ్ ఈవెంట్ కోసం కరీమ్ RTAతో భాగస్వామ్యం కావడం ఇది వరుసగా మూడో సంవత్సరమని రోడ్స్ రైట్ ఆఫ్ వే, ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ డైరెక్టర్, RTA స్పోర్ట్స్ టీమ్ హెడ్ అబ్దుల్‌రహ్మాన్ మొహమ్మద్ అల్జనాహి అన్నారు. “ఈ సంవత్సరం నివాసితులు, పర్యాటకులకు దుబాయ్ రైడ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి RTA మిషన్‌కు మద్దతు ఇవ్వడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఉచిత బైక్ రెంటల్‌లను అందించడం ద్వారా, ప్రతి ఒక్కరూ తమ సొంత బైక్‌ని కలిగి ఉన్నా లేకపోయినా ఈ ఈవెంట్‌లో పాల్గొనడాన్ని మేము గతంలో కంటే సులభతరం చేస్తున్నాము.”అని కరీమ్‌లోని సీనియర్ ఆపరేషన్స్ డైరెక్టర్ సమీ అమిన్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల