QR2.026 ట్రిలియన్కు చేరిన ఖతార్ బ్యాంకింగ్ రంగ ఆస్తులు..!!
- November 08, 2024
దోహా: QNB ఫైనాన్షియల్ సర్వీసెస్ (QNBFS) విడుదల చేసిన నివేదిక ప్రకారం..ఖతార్ బ్యాంకింగ్ రంగం సెప్టెంబర్ నెలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. సెప్టెంబరు లో దేశీయ ఆస్తులలో 1.1% లాభం వచ్చింది. మొత్తం ఆస్తులు 2023లో 3.4% వృద్ధితో పోలిస్తే 2024లో 2.9% పెరిగాయి మరియు గత ఐదేళ్లలో (2019-2023) సగటున 6.8% పెరిగాయి. మొత్తం లిక్విడ్ ఆస్తులు సెప్టెంబర్ లో 30.3%కి పెరిగాయి. ఆగస్టు లో 29.8% గా ఉన్నాయి. సెప్టెంబరులో రుణాల పెరుగుదల ప్రధానంగా ప్రైవేట్ రంగం 0.7% లాభపడింది. 2024లో వృద్ధితో పోలిస్తే రుణాలు 4.8% పెరిగాయి.వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల పరంగా సెప్టెంబర్ లో 1.1% పెరిగి QR1,046.9bnకి చేరుకుంది. ప్రభుత్వ రంగ డిపాజిట్లలో 1.3%, నాన్ రెసిడెంట్ డిపాజిట్ల నుండి 2%, ప్రైవేట్ రంగ డిపాజిట్ల నుండి 0.6% పెరుగుదలతో సెప్టెంబర్లో డిపాజిట్లు విస్తృతంగా పెరిగాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల