యూఏఈలో విమాన టిక్కెట్ల ఫ్రాడ్..1 మిలియన్ దిర్హాంల ఇంధన స్కామ్..!!
- November 08, 2024
యూఏఈ: దుబాయ్‌లోని అల్ నహ్దా నుండి పనిచేస్తున్న ప్రైమ్ ఎక్స్పర్ట్స్ కన్స్ట్రక్షన్ ఎల్ఎల్సి.. భారీ స్కాములకు పాల్పడింది. అనేక మంది వ్యాపారవేత్తలను ముంచింది. పోస్ట్-డేటెడ్ చెక్‌లను ఉపయోగించి అందరినీ నమ్మించి బోర్డు తిప్పేసింది. ప్రతి 15 రోజులకు చెల్లింపు చేస్తామని హామీతో సెక్యూరిటీ చెక్కులు ఇచ్చి మోసం చేశారని దుబాయ్‌కి చెందిన ట్రావెల్ ఏజెన్సీ అయిన ఫ్లైవోర్‌కు చెందిన బెహ్జాద్ భట్టి తెలిపారు. లండన్ నుండి లాహోర్, మస్కట్ నుండి ముంబై మార్గాల్లో వందలాది అంతర్జాతీయ విమాన టిక్కెట్లు పొందారని పేర్కొన్నారు. ఫ్లైవోర్ మాత్రమే ప్రైమ్ నిపుణుల కోసం 201 అంతర్జాతీయ టిక్కెట్లను బుక్ చేసింది. షార్జా అన్సార్ మాల్లోని కోజ్మో ట్రావెల్స్ మరియు డోజాయిన్ వంటి ఇతర ట్రావెల్ ఏజెన్సీలు వరుసగా Dh98,000 మరియు Dh206,000 నషపోయినట్టు వెల్లడించాయి. విమానాలు, హోటళ్లతో పాటు ప్రైమ్ కంపనీ పెద్ద మొత్తంలో డీజిల్ ఆర్డర్లను ఇచ్చి ఆల్ఫా పెట్రోలియం, త్రీ స్టార్ ఫ్యూయెల్స్, ఎటెమాడి ఫ్యూయల్ అండ్ పెట్రోలియం వంటి సరఫరాదారులకు మొత్తం Dh1 మిలియన్లకు పైగా చెల్లించకుండా మోసం చేసింది. కంపెనీ నకిలీ VAT సర్టిఫికేట్లు, ఆడిట్ నివేదికలతో సహా నకిలీ పత్రాలను ఉపయోగించిందని అధికారులు తెలిపారు. ఈ పత్రాలను అందించిన ఆడిట్ సంస్థపై చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చాలా మంది బాధితులు కోర్టుకు వెళ్ళాలని భావిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







