కువైట్ ఇండియన్ ఎంబసీలో ఆకట్టుకున్న 'దక్షిణ సంభ్రమ'..!!
- November 09, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని నవంబర్ 8వ తేదీన "దక్షిణ సంభ్రమ"ను నిర్వహించింది. ఎంబసీ ఆడిటోరియంలో ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వివిధ కమ్యూనిటీ సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంబాసిడర్ డాక్టర్ ఆదర్శ్ స్వైకా తన ప్రారంభ ప్రసంగంలో.. కమ్యూనిటీ మద్దతు కోసం ఎంబసీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎంబసీ 12 వాట్సాప్ నంబర్లు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. ఇటీవల ఎంబసీ సిబ్బందిగా నటిస్తూ.. సహాయం కోసం డబ్బు అడుగుతున్నారని , ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అనంతరం కన్నడ కూట, తుళు కూట, బిల్లవ సంఘం, తెలుగు కళా సమితి, ప్రవాసాంధ్ర తదితర సంఘాల సభ్యులచే మంత్రముగ్ధులను చేసే శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు.ముఖ్యంగా తులనాడు పులి నృత్యం, యక్షగాన, కూచిపూడి, చక్కా భజనలు వంటి సాంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయ. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపే ప్రదర్శనలు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







