కువైట్‌లో బయటపడ్డ కాంస్య యుగం నాటి ఆలయం..!!
- November 10, 2024
కువైట్: 4000 సంవత్సరాల క్రితం కాంస్య యుగం దిల్మున్ నాగరికత నాటి ఫైలాకా ద్వీపంలో ఆలయాన్ని కనుగొన్నట్లు కువైట్-డెన్మార్క్ బృందం ప్రకటించింది. ప్యాలెస్ సైట్ తూర్పు ప్రాంతంలో (6F) అని పిలువబడే కొండ వద్ద ఉన్న దిల్మున్ ఆలయం బయటపడింది. ఈ మేరకు కువైట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ (NCCAL) వెల్లడించింది. కువైట్ చరిత్ర, స్మారక చిహ్నాలను పరిరక్షించడం, సెర్చ్- పునరుద్ధరణ కోసం పురావస్తు పరిశోధనలపై ఎక్కువ శ్రద్ధ చూపుతోందని NCCAL మ్యూజియం, స్మారక చిహ్నాల విభాగం తాత్కాలిక అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మహ్మద్ బిన్ రెధా తెలిపారు. ఈ ఆలయం ద్వారా అరేబియా గల్ఫ్‌లో ఫైలాకా సాంస్కృతిక, వాణిజ్య, సామాజిక పాత్రను హైలైట్ చేస్తుందన్నారు.
కువైట్‌లోని డానిష్ పురావస్తు యాత్ర అధిపతి డాక్టర్ స్టీఫన్ లార్సెన్ మాట్లాడుతూ..ఆలయం 1900-1800 BC నాటిదన్నారు.. బృందం ఈ సంవత్సరం దాదాపు ఆలయం పూర్తి డిజైన్, 11 sm, అనేక కళాఖండాలను కలిగి ఉందని పేర్కొన్నాడు. దిల్మున్ నాగరికత మతపరమైన పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఈ ఆవిష్కరణ ఒక మైలురాయి అని ఆయన వెల్లడించారు. ఈ ఆవిష్కరణ స్థానికంగా, ప్రాంతీయంగా ముఖ్యమైనదని కువైట్ విశ్వవిద్యాలయం ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ హసన్ అష్కెనాని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







