ఐ కేర్ టీమ్ ఇఫ్తార్ మీల్స్
- June 24, 2016
ఐ కేర్ టీమ్ జూన్ 23న సోనాపూర్‌లో ఉన్న మసీదు దగ్గర 175 ఇప్తార్ ఆహారపు ప్యాకెట్లను పంచిపెట్టారు. కొంతమంది పిల్లలతో ఐ కేర్ టీమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పద్మజగారు మాట్లాడుతూ, పిల్లలకు స్వచ్ఛంద సేవ గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ కేర్ టీమ్ సభ్యులు అమృతగారు, పూనమ్ గారు, కళ గారు, శ్రీలక్ష్మి గారు, సతీష్ గారు, కృష్ణ కిషోర్‌గారు, సూర్య గారు, చిన్నారులు వివిఎస్ దివ్య, వివిఎస్ క్రిష, ధృవ దత్త, హెమిష్, భవ్య, శివమ్, యశస్వి, నిరంజన దత్త పాల్గొన్నారు. టీమ్ సభ్యులు సుభాషిణిగారు, ధనలక్ష్మిగారు, అలివేలుగారు, ఐశ్వర్యగారు, శివ పార్వతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలని, ఈ మంచి పని తమకు ఎంతో తృప్తినిచ్చిందని నిర్వాహకులు తెలిపారు.




తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







