2024 చివరి నాటికి QR26.73bnకి డిజిటల్ కామర్స్ మార్కెట్..!!
- November 12, 2024
దోహా: ఖతార్‌లో డిజిటల్ కామర్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. స్టాటిస్టా నివేదిక ప్రకారం, డిజిటల్ కామర్స్ మార్కెట్‌లో లావాదేవీ విలువ సంవత్సరాంతానికి $7.29bn (QR26.73bn)గా అంచనా వేస్తున్నారు. లావాదేవీ విలువ 21.70 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR)ని చూపుతుందని నివేదిక పేర్కొంది. దీని ఫలితంగా 2024 నుండి 2029 వరకు అంచనా వేసిన మొత్తం $19.46 బిలియన్లుగా ఉంది. ఖతారీ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఖతార్‌లో డిజిటల్ వాణిజ్యం కూడా నియంత్రణ వాతావరణం, ఆధునిక సాంకేతికతలకు అనుగుణంగా వ్యాపార మార్కెట్‌లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుందని విశ్లేషకులు తెలిపారు. రాబోయే కోసం వ్యూహాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం వెబ్ సమ్మిట్ ఖతార్, ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా నిపుణులు ప్రశంసించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







