ఇజ్రాయెల్ దురాక్రమణపై నిప్పులు చెరిగిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- November 12, 2024
రియాద్: గాజా, లెబనాన్‌లపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దురాక్రమణను తమ దేశం తీవ్రంగా ఖండిస్తుందని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ పునరుద్ఘాటించారు. సోమవారం రియాద్‌లో అసాధారణ అరబ్-ఇస్లామిక్ సమ్మిట్‌ను ప్రారంభించిన ఆయన, ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఇజ్రాయెల్‌ను ఒత్తిడి తీసుకురావాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. పాలస్తీనా అథారిటీ పాత్రను తగ్గించడాన్ని, గాజాలో మానవతావాద సంస్థల పనిని అడ్డుకోవడంపై క్రౌన్ ప్రిన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. "అమాయక ప్రజలపై ఇజ్రాయెల్ నిరంతరం నేరాలు చేయడం, అల్-అక్సా మసీదు పవిత్రతను నిరంతరం ఉల్లంఘించడం వల్ల పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కుల భద్రతను దెబ్బతీస్తుందని మేము ధృవీకరిస్తున్నాము" అని అతను పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో పూర్తి సభ్యత్వానికి పాలస్తీనాకు అర్హత ఉందని క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







