భవిష్యత్తులో విపత్తుల కోసం సిద్ధమవుతున్న దుబాయ్..!!
- November 12, 2024
యూఏఈ: ఏప్రిల్ వర్షాల బీభత్సం నుంచి దుబాయ్ పాఠాలు నేర్చుకుంటుంది. రాబోయే రోజుల్లో విపత్తుల కోసం సిద్ధమవుతుంది. దుబాయ్‌లోని పద్నాలుగు ప్రాంతాలు వరదలకు గురయ్యే ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. మరోసారి వర్షాలు పడితే ఈ ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని గుర్తించారు. హాట్‌స్పాట్‌లలో మూడు ప్రాంతాలు షేక్ జాయెద్ రోడ్‌లో, రెండు అల్ ఖైల్ రోడ్‌లో, నాలుగు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్‌లో ఉన్నాయి. దీంతోపాటు ఎమిరేట్స్ రోడ్‌లోని రెండు ప్రదేశాలు, సెయిహ్ అల్ సలామ్ స్ట్రీట్‌లో ఒకటి, రాస్ అల్ ఖోర్ స్ట్రీట్‌లో ఒకటి, అల్ రబాత్ స్ట్రీట్‌లో ఒక ప్రాంతాన్ని గుర్తించారు.
ఈ ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావాల నుండి నివాసితులు, మౌలిక సదుపాయాలను రక్షించడానికి దుబాయ్ అధికారులు చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. దుబాయ్ పోలీసులు 'సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ' అనే అంశంపై సెమినార్‌ను సందర్భంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు దుబాయ్ మునిసిపాలిటీలో కార్పొరేట్ రిస్క్ మేనేజ్‌మెంట్ అండ్ బిజినెస్ కంటిన్యూటీ డైరెక్టర్ మొహమ్మద్ అల్ ధన్హానీ తెలిపారు.
రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) వాణిజ్య రవాణా కార్యకలాపాల విభాగం డైరెక్టర్ ముహన్నద్ ఖలీద్ అల్ ముహైరి మాట్లాడుతూ.. 14 హాట్‌స్పాట్‌లతో పాటు వర్షాకాలంలో సమస్యలు తలెత్తే 22 ఇతర ప్రదేశాలను గుర్తించామని తెలిపారు. దుబాయ్ మునిసిపాలిటీ సహకారంతో నీటిని నిర్దేశించిన ఛానెల్‌లలోకి వెళ్లేలా పంపుల ఏర్పాటును చేపట్టినట్లు పేర్కొన్నారు.
2033 నాటికి పూర్తి కావాల్సిన 'తస్రీఫ్' పేరుతో 30 బిలియన్ దిర్హామ్‌ల వర్షపు నీటి పారుదల నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌కు సంబంధించి యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇటీవల చేసిన ప్రకటించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్‌వర్క్ బస్ట్..!!







