డాలస్ లో 'గాంధీతాత చెట్టు' తెలుగు సినిమా ఉచిత ప్రదర్శన
- November 17, 2024
డాలస్, టెక్సస్: “గాంధీతాత చెట్టు” అనే తెలుగు సినిమా నిర్మాత శేష సింధూ రావు, తెలుగు-ఇండి ఫిల్మ్ సంధాత డాన్జీ తోటపల్లి, ఫెస్టివల్ డైరెక్టర్ క్రిస్టియన్ ఫ్రాస్ట్ అమెరికా దేశంలోనే అతి పెద్దదైన డాలస్ లో నెలకొనియున్న మహాత్మాగాంధీ మెమోరియల్ ను సందర్శించి బాపూజికి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “మహాత్మాగాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఒక బాలిక ద్వారా చెప్పించడం భావితరాలకు వారధిగా నిలిచే ఒక గొప్ప సందేశం ఈ చలనచిత్రంలో ఇమిడి ఉందని, ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి సినిమా తీయాలనే తలంపు రావడం అభినందనీయం అంటూ సినీ నిర్మాత, దర్శకులకు శుభాకాంక్షలు అందజేశారు.”
ఈ చలనచిత్ర నిర్మాత శేష సింధూరావు, తెలుగు ఇండిక్ ఫిల్మ్ సంధాత డాన్జీ తోటపల్లి, ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ క్రిస్టియన్ ఫ్రాస్ట్ లు మాట్లాడుతూ ఈ సినిమాలో సుకృతి వేణి బండ్రెడ్డి (ప్రముఖ దర్శకులు సుకుమార్ కుమార్తె) పోషించిన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని, ఈ చిత్రనిర్మాణంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకులు సుకుమార్ అందించిన సహకారం వెలకట్టలేనిది అన్నారు. ఈ “గాంధీతాత చెట్టు” అనే తెలుగు సినీమాను గాలాక్సీ యట్ గ్రాండ్ స్కేప్, ది కాలనీ లో నవంబర్ 16, శనివారం సాయంత్రం 6 గంటలకు ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు, ఆసక్తిఉన్నవారు [email protected] కు email చేసి తమ టికెట్లను పొందవచ్చు అన్నారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వల, గవర్నింగ్ బోర్డు సభ్యులు అనంత్ మల్లవరపు చలనచిత్ర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి.శ్రీనివాస్, ఎ.కె నాయుడు మరికొంతమంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..







