ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం..!
- November 18, 2024
ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. నైజీరియా మోదీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ (GCON) అవార్డుతో సత్కరించనుంది. 1969లో క్వీన్ ఎలిజబెత్‌కు కూడా నైజీరియా ఇదే అవార్డును ప్రదానం చేసింది.
ఆ తర్వాత ఈ అవార్డును అందుకోనున్న విదేశీ ప్రముఖుడిగా మోదీకి ప్రత్యేక స్థానం దక్కింది. విదేశాల్లో ప్రధాని మోదీ అంతర్జాతీయ అవార్డులను అందుకోగా.. అందులో ఇది 17వ పురస్కారం. నైజీరియాలోని అబుజా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్‌వో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేశారు.
నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నైజీరియా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చించనున్నారు. జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్లనున్నారు. ఆ తర్వాత వివిధ సభ్యదేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.
ఈ నెల 18, 19 తేదీల్లో రియో డీ జనీరోలో జరగబోయే శిఖరాగ్ర సమావేశానికి కూడా మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకానున్నారు. గయానా దేశాధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఈ నెల 19న మోదీ గయానాకు చేరుకోనున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు మోదీ అక్కడే ఉండనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







