దోహా వేదికగా వైభవంగా ప్రారంభమైన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
- November 22, 2024
దోహా: దోహా వేదికగా జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాషాభిమానులు , సాహితీ వేత్తలు , కవులు , రచయితలు , వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సదస్సును ప్రారంభించారు. తెలుగు గడ్డకు దూరంగా నివసిస్తున్నా, భాషాభిమానంతో వంగూరి ఫౌండేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించటం అభినందనీయమని వెంకయ్య నాయుడు కొనియాడారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహితీ సౌరభాలు వెదజల్లేలా దోహా వేదికగా 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. ఖతార్ దేశం లో భారత రాయబారి విపుల్ కు పలు హిందీ, తెలుగు గ్రంధాలను యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ బహూకరించారు. వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు అనారోగ్యం వలన వీడియో సందేశం పంపారు. దర్శక నిర్మాత వై వి యస్ చౌదరి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు భాగవతుల వెంకప్ప తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా పలువురు ప్రముఖులు ప్రసంగాలు చేయనున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రత్నిది, ఖతార్)

తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







