దుబాయ్ లో కీలక ప్రాంతాల్లో పూర్తయిన 141 బస్ షెల్టర్లు..!!

- November 24, 2024 , by Maagulf
దుబాయ్ లో కీలక ప్రాంతాల్లో పూర్తయిన 141 బస్ షెల్టర్లు..!!

దుబాయ్: దుబాయ్ లోని కీలక ప్రాంతాల్లో 141 బస్ షెల్టర్లు ఏర్పాటు చేయడంతో దుబాయ్‌లోని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈ బస్ షెల్టర్‌లు 2025 చివరి నాటికి ప్రారంభం కావాల్సి ఉంది.  నగరం అంతటా 762 షెల్టర్‌లను అందించాలనే అధికార ప్రణాళికలో ఇవి భాగం అని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయబడిన షెల్టర్‌లు బహుళ బస్ రూట్‌లను అందిస్తాయని తెలిపారు. కొన్ని షెల్టర్‌కు 10 రూట్‌లకు పైగా వసతి కల్పిస్తాయని భావిస్తున్నారు. ఏటా 182 మిలియన్లకు పైగా రైడర్‌లకు సేవలు అందిస్తాయని భావిస్తున్నారు.   జనసాంద్రత, ముఖ్యమైన ప్రాంతాల అవసరాలను తీర్చడానికి ఈ కొత్త షెల్టర్ల కోసం ప్రాంతాలను ఎంపిక చేసినట్టు తెలిపారు.  బస్ షెల్టర్‌లు రోజువారీ వినియోగం ఆధారంగా నాలుగు స్థాయిలుగా వర్గీకరించారు. 750 కంటే ఎక్కువ రోజువారీ వినియోగదారులు ఉన్న ప్రదేశాల కోసం ప్రాథమిక షెల్టర్‌లు, 250 నుండి 750 రోజువారీ వినియోగదారుల కోసం ద్వితీయ షెల్టర్‌లు, 100 నుండి 250 రోజువారీ వినియోగదారుల కోసం ప్రాథమిక షెల్టర్‌లు , డ్రాప్-ఆఫ్/పికప్ 100 కంటే తక్కువ రోజువారీ వినియోగదారుల కోసం షెల్టర్లు నిర్మిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com