'రాబిన్‌హుడ్' నుంచి వన్ మోర్ టైమ్ సాంగ్ రిలీజ్
- November 26, 2024
హీరో నితిన్ మచ్-అవైటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి.ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్- వన్ మోర్ టైమ్‌ని రిలీజ్ చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.
ఎలక్ట్రోపాప్ జానర్‌లో హస్కీ ఇంగ్లీష్ కోరస్‌తో సాంగ్ ఓపెన్ అయ్యింది. అకౌస్టిక్, గిటార్ రిఫ్స్ డైనమిక్ బ్లెండ్ తో జి.వి.ప్రకాష్ కుమార్, పాప్ క్వీన్ విద్యా వోక్స్ డిఫరెంట్ స్టయిల్ వోకల్స్ తో అలరించారు. జి.వి.ప్రకాష్ గ్రేస్ ఫుల్ గా పెర్ఫార్మ్ చేయగా, విద్యా వోక్స్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.
ప్రేమకోసం తన గర్ల్ ఫ్రెండ్ తో మరో అవకాశం కోరే హీరో గురించిన సాంగ్ ఇది. హీరో హానెస్టీ ని మెచుకున్నప్పటికీ, తర్వాత వచ్చే కాన్సెక్యూన్సెస్ కి జాగ్రత్తగా ఉండమని హీరోయిన్ సలహా ఇస్తుంది. అద్భుతమైన, ఎక్సోటిక్ లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాటకు కృష్ణకాంత్ యూత్‌ఫుల్ లిరిక్స్ రాశారు.
నితిన్, శ్రీలీల అద్భుతమైన కెమిస్ట్రీ, ఎట్రాక్టివ్ డ్యాన్స్ మూవ్స్ తో ట్రాక్‌ను ఎలివేట్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎనర్జిటిక్ ఫ్లెయిర్‌ని యాడ్ చేసింది. నిస్సందేహంగా, వన్ మోర్ టైమ్ ఆల్టిమేట్ లవ్ ఫ్యూజన్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది,ఇన్స్టంట్ గా టాప్ చార్ట్స్ లోకి వెళ్ళింది.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. కోటి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటి
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, విక్రం మోర్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







