500 దినార్లకు రెసిడెన్సీ పర్మిట్ల సేల్..కంపెనీ నిర్వాహకులు అరెస్ట్..!!
- November 27, 2024
కువైట్: 500 దినార్లకు రెసిడెన్సీ పర్మిట్ల సేల్ చేస్తున్నకంపెనీ నెట్ వర్క్ ను అధికారులు ఛేదించారు. సాధారణ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ ఫోర్జరీ, అధికారిక పత్రాలను తారుమారు చేయడం, డబ్బుకు బదులుగా ప్రవాసులకు రెసిడెన్సీని కల్పించడం వంటి ఆరోపణలపై ఒక కువైట్ పౌరుడు, అతని బిజినెస్ పార్టనర్ సిరియన్ జాతీయుడితో సహా కంపెనీ నిర్వాహకుల ముఠాను అరెస్టు చేసినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిందితులు దేశంలో ఉన్న కార్మికుల రెసిడెన్సీలను చట్టవిరుద్ధంగా కంపెనీకి బదిలీ చేసారని, ఒక్కో కార్మికుడికి 500 దినార్ల చొప్పున కార్మికులకు హెవీ ఎక్విప్మెంట్ డ్రైవర్ రెసిడెన్సీని పొందేందుకు, కంపెనీ తన స్పాన్సర్షిప్ కింద రిఫర్ చేసిందని అధికారులు తెలిపారు దాదాపు 600 మంది కార్మికులు కంపెనీ కింద నమోదు చేసుకున్నట్టు గుర్తించినట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







