దుబాయ్ లో తొలిసారి 3-రోజుల సూపర్ సేల్ పొడిగింపు..!!
- November 28, 2024
దుబాయ్: దుబాయ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన మూడు-రోజుల సూపర్ సేల్ (3DSS)ని ఈ సంవత్సరం తొలిసారిగా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది నవంబర్ 29న ప్రారంభమై, డిసెంబర్ 2 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. దుబాయ్ అంతటా 3వేల కంటే ఎక్కువ స్టోర్లు, 500 బ్రాండ్‌లలో మెగా డీల్‌లతోపాటు 90 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.
దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) ద్వారా నిర్వహిస్తున్న ఈ సూపర్ సేల్‌లో ఫ్యాషన్, ఫుట్ వేర్, యాక్సెసరీస్, బ్యూటీ, వెల్నెస్, హోమ్ అండ్ కిచెన్ ఇలా అనేక రకాల వస్తువులను తక్కవ ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఎక్కడ షాపింగ్ చేయాలంటే?
దుబాయ్‌లోని ప్రముఖ షాపింగ్ మాల్స్, రిటైల్ స్టోర్లలో ఆఫర్లు అందుబాటుల్లో ఉన్నాయి.
అల్ ఖవానీజ్ వాక్, బర్జుమాన్, సిటీ సెంటర్ అల్ షిందాఘ, సిటీ సెంటర్ డీరా, సిటీ సెంటర్ మ్యూజియం, సిటీ సెంటర్ మిర్డిఫ్, సర్కిల్ మాల్, సిటీ వాక్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, ఇబ్న్ బటూటా, మాల్ ఆఫ్ ఎమిరేట్స్, మార్కెట్, నఖీల్ మాల్, ఒయాసిస్ సెంటర్, బీచ్ JBR
అవుట్‌లెట్ విలేజ్, వఫీ మాల్స్‌లో సూపర్ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇక ఆన్‌లైన్‌లో కూడా అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ ఫ్రైడే సేల్ (లేదా వైట్, ఎల్లో, రెడ్, బ్లూ ఫ్రైడే) కూడా జరుగుతున్నందున మీరు షాపింగ్ డీల్‌లను అందుకోవచ్చు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







