జ్యువెలరీ అరేబియా 2024.. 30శాతం పెరిగిన సందర్శకులు..!!
- November 28, 2024
మనామా: జ్యువెలరీ అరేబియా 2024 సక్సెస్ అయింది. గత సంవత్సరంతో పోలిస్తే 30% సందర్శకులు పెరిగారని బహ్రెయిన్ ఆభరణాల వ్యాపారులు వెల్లడించారు. బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ చైర్‌పర్సన్ సారా అహ్మద్ బుహిజీ మాట్లాడుతూ.. జ్యువెలరీ అరేబియా ఈవెంట్ సక్సెస్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. "ఈ ఏడాది ఎక్కువ మంది బహ్రెయిన్ ఆభరణాలు తమ ప్రత్యేకమైన డిజైన్‌లను ప్రదర్శిస్తున్నాం. వీటిలో చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను ఆకర్షించే ఐకానిక్ బహ్రెయిన్ ముత్యాలు ఉన్నాయి." అని బుహిజీ చెప్పారు.
ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లోని మొత్తం ఏడు హాల్‌లలో ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. "బహ్రెయిన్‌కు ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌లను తీసుకురావడానికి, గ్లోబల్ ఎగ్జిబిషన్స్ హబ్‌గా ఖ్యాతిని పటిష్టం చేయడానికి ఇన్‌ఫార్మా మార్కెట్స్ వంటి ప్రైవేట్ రంగ భాగస్వాములతో కలిసి పని చేయడం మాకు గర్వకారణం." అని బుహిజీ జోడించారు.
ఇన్ఫార్మా మార్కెట్స్ జనరల్ మేనేజర్ మొహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 27 దేశాల నుండి 700 మందికి పైగా ఎగ్జిబిటర్లు, గత సంవత్సరంతో పోలిస్తే ప్రారంభ రోజు సందర్శకుల సంఖ్య గణనీయంగా 33% పెరిగిందన్నారు. ఈ విజయానికి బహ్రెయిన్ అత్యాధునిక మౌలిక సదుపాయాలే కారణమని అన్నారు.
ఈ సంవత్సరం జ్యువెలరీ అరేబియా సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి యాప్‌ను కూడా పరిచయం చేసింది. "యాప్ షెడ్యూల్‌లు, అప్‌డేట్‌లు, ప్రత్యేక ఆఫర్‌లను ఒకే చోట చూపెడుతుంది. దీంతో సందర్శకులు మెరుగైన అనుభవాన్ని పొందుతున్నారని ఇబ్రహీం తెలిపారు. యాప్ డౌన్‌లోడ్‌లు గత సంవత్సరంతో పోలిస్తే 80% పెరిగాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







