అమరావతి: రాజధాని నిర్మాణానికి భూ కేటాయింపులు

- November 29, 2024 , by Maagulf
అమరావతి: రాజధాని నిర్మాణానికి భూ కేటాయింపులు

అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతి నిర్మాణానికి శ‌ర‌వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రి నారాయణ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా సచివాలయంలో భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

రాజధానిలో ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు వైద్యకళాశాల కోసం 20 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. అమరావతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రితో పాటు మెడికల్ కాలేజీ కోసం 20 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. గతంలో 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం హయాంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి గడువు పొడిగించింది.

దీంతోపాటు సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్స్‌ అండ్‌ డిజైన్‌కు 5 ఎకరాలు, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 15 ఎకరాలు ఇచ్చింది. ఎల్‌ అండ్‌ టీ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌కు 5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ తెలిపారు.

అంతేకాకుండా బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయించినట్లు వెల్లడించారు. ఇక ఇక టీడీపీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు మంత్రివర్గ ఉపసంఘం అంగీకారం తెలిపింది. గతంలో 131 మందికి భూములు ఇవ్వగా.. వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నామని వివరించారు.

గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నామన్నారు. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని మంత్రి నారాయణ వివరించారు. డిసెంబర్ నెలాఖరులోగా భూకేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ డిసెంబరు నెలాఖరుకు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయన్నారు. వచ్చే జనవరి నుం చి రాజధానిలో పనులు మొదలవుతాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com