'కబాలి' తెలుగు పాటలు నేడు విడుదల..
- June 26, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. టీజర్‌తో మొదలుకొని ప్రీ రిలీజ్ బిజినెస్ వరకు పలు రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రం ఇప్పుడు మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత రెక్స్ సినిమాస్ ఆడిటోరియంలో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ సినిమాగా 'కబాలి' చరిత్రలో నిలిచిపోనుంది. 2వేల మందికిపైగా కూర్చునే సదుపాయం కలిగిన ఈ థియేటర్లో భారీ తెరపై సినిమా వీక్షణ చక్కని అనుభూతిని కలిగిస్తుందని, అందులోనూ తలైవర్ సినిమాను చూడడం అంటే పదింతలు రెట్టింపు సంతోషంగా ఉందని ఫ్రాన్స్‌లోని ఓ తమిళ సినీ అభిమాని పేర్కొన్నాడు. అధికారికంగా ప్రకటించక పోయినా జూలై 15న 'కబాలి' విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఒకరోజు ముందుగానే అంటే 14న రెక్స్ సినిమాస్‌లో ప్రీమియర్ ప్రదర్శన ఉంటుందని సమాచారం. ఈ ప్రీమియర్‌కు రజనీ హాజరయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 'కబాలి'పై భారీ అంచనాలున్న నేపథ్యంలో తాజా పరిమాణాలు ఆ అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే 'కబాలి' తెలుగు పాటలు నేడు విడుదల కానున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







