పేగుల్ని క్లీన్ చేసే డ్రింక్స్ ...!
- December 03, 2024
ఆరోగ్యమే మహాభాగ్యం.ఆరోగ్యంగా ఉండాలంటే గట్ హెల్త్ ఎంతో కీలకం.మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలన్ని అందిస్తుంది గట్.అంతేకాకుండా వ్యర్థ మలిన పదార్థాల్ని కూడా బయటకు పంపిచేస్తుంది.పేగులు ఆరోగ్యంగానే ఉంటేనే ఓ వ్యక్తి ఎలాంటి సమస్య లేకుండా ఉంటాడు.పేగులు అనారోగ్యంగా ఉంటే జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది.దీంతో కడుపు సమస్యలతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది.
రోగనిరోధక శక్తి తగ్గితే రకరకాల వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.అంతేకాకుండా అన్ హెల్తీ గట్ కారణంగా పెద్ద పేగుల్లో వాపు, ఎండో క్రైన్ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.అందుకే పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.పేగులకు హాని చేసే ఫుడ్స్ తీసుకోకూడదు.అంతేకాకుండా కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల పేగుల్ని శుభ్రపర్చుకోవచ్చు. ఆ డ్రింక్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. పెరుగు ఆధారిత లస్సీ కూడా తాగడం వల్ల పేగుల ఆరోగ్యం మెరగవుతుంది. ఇందులో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి. పేగుల్లోని బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడటంలో లస్సీ ఉపయోగపడుతుంది. రోజూ లస్సీ తాగడం వల్ల పేగు కదిలికలు మెరుగుపడతాయి. దీంతో.. గట్ సమస్యలు తగ్గుతాయి.
2. మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి కడుపులో బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. మజ్జిగ కడుపుని చల్లబరుస్తుంది. పేగుల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మజ్జిగ జీర్ణ ఎంజైమ్‌లను క్రమబద్దీకరిస్తుంది. రోజూ మజ్జిగ తాగడం వల్ల పేగులు క్లీన్ అవుతాయని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
3. ఉసిరి రసం లేదా జ్యూస్‌లో అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఉసిరి రసం రోజూ తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో కణాల ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఉసిరి రసంలో ఉండే ఫైబర్ పేగు కదిలికల్లో సాయపడుతుంది. దీంతో.. పేగులు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
4. జీలకర్రలో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. జీలకర్రను నీటిలో నానబెట్టడం ద్వారా ఈ పోషకాలన్నీ రెట్టింపు అవుతాయి. ఈ నీరు తాగడం వల్ల జీర్ణశక్తి మెరగవుతుంది. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. దీన్ని రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది. పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.
5. అల్లం టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి.దీంతో.. ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.అల్లం టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వికారాన్ని తగ్గిస్తాయి.పేగుల్ని శుభ్రంగా మారుస్తాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







