జూలై 1న అర్ధనారి విడుదల ..
- June 26, 2016
భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో ఎమ్.రవికుమార్ నిర్మించిన చిత్రం 'అర్ధనారి'. అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు మాట్లాడుతూ - ''దర్శకుడి ప్రతిభకు తగ్గ గుర్తింపు ఇంకా రాలేదు. ప్రచార చిత్రం థ్రిల్లింగ్‌గా, ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంతో భాను తప్పకుండా పెద్ద విజయం అందుకుంటాడు'' అన్నారు. ''ఎవరైనా ప్రముఖ హీరోతో ఈ చిత్రం చేయాలని ప్రయత్నించినప్పటికీ..అర్ధనారిగా కనిపించడానికి ఎవరూ ముందుకు రాలేదు. చాలా అరుదుగా ఇటువంటి చిత్రాలు వస్తాయి. సందేశంతో పాటు కమర్షియల్ అంశాలున్న చిత్రం'' అని భానుశంకర్ అన్నారు. జూలై 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: నివాస్, కెమేరా: సాయి శ్రీనివాస్ గాదిరాజు, నిర్మాణ నిర్వహణ: కర్లపూడి కృష్ణ, సంగీతం: రవివర్మ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







