వీటిని ఎట్టి పరిస్థితుల్లో తాగకండి?
- December 09, 2024
యూరిక్ యాసిడ్ ఒక వ్యర్థ పదార్థం. ఇది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది.ఈ రోజుల్లో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. తీసుకునే ఆహారం, డ్రింక్స్‌లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాల్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ తినడం ఇవన్నీ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో కీళ్ల నొప్పులు ముందు వరుసలో ఉంటుంది. యూరిక్ యాసిడ్ స్థాయి 7.0 mg/dl కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది కీళ్లలో స్పటికాల రూపంలో పేరుకుపోతుంది. దీంతో కీళ్లల్లో నొప్పి, వాపు కలుగుతుంది.
ఇది శరీరంలో అధికంగా పేరుకుపోయినప్పుడు లేదా మూత్రపిండాలు దానిని సరైన మొత్తంలో తొలగించలేనప్పుడు, అది కీళ్లనొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లతో ఇతర సమస్యల్ని కలిగిస్తాయి. మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎంత ఉత్పత్తి అవుతుందనే దానిపై మన ఆహారం ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అయితే, కొన్ని డ్రింక్స్ వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వీటిని తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్‌తో పాటు కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి. ఆ డ్రింక్స్ ఏంటో ఇక్కడ చుద్దాం.
1. ఆల్కహాల్, ముఖ్యంగా బీర్ అధిక సాంద్రత కలిగి ఉంటాయి. ఇవి తాగితే యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఆల్కహాల్ శరీరం నుంచి యూరిక్ యాసిడ్ యొక్క తొలగింపును నిరోధిస్తుంది. అంతేకాకుండా శరీరంలో దాని స్థాయిలను పెంచుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం డ్యామేజ్ అయ్యే ప్రమాదముంది. అంతేకాకుండా ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్పటికాల రూపంలో కీళ్లలో పేరుకుపోయే ప్రమాదముంది. దీంతో.. కీళ్ల నొప్పుల సమస్య వస్తుంది.
2. ఈ రోజుల్లో చాలా మంది మార్కెట్లలో దొరికే ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు. అయితే, ఈ ఎనర్జీ డ్రింక్స్ అధిక మొత్తంలో చక్కెర, కృత్రిమ స్వీటెనర్లను కలిగి ఉంటాయి. వీటిని తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో.. కీళ్ల నొప్పుల సమస్య, కిడ్నీలో రాళ్ల సమస్యలు పెరుగుతాయి. ఈ డ్రింక్స్‌తో పాటు ప్యూరిన్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. తేనె, స్వీట్స్, రెట్ మీట్, పప్పులు వంటివి రాత్రి పూట తినకూడదు.
3. సోడా, జ్యూస్, స్పోర్ట్స్ డ్రింక్స్ మొదలైన ఫ్రక్టోజ్ డ్రింక్స్ యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఫ్రక్టోజ్ అనేది అనేక పండ్లలో కనిపించే ఒక రకమైన చక్కెర. కానీ ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాలకు దీనిని జోడించినప్పుడు, అది యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. అందుకే సోడాలు, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసులు ఎక్కువగా తాగకూడదు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!