రాజకీయ ధీరురాలు-సోనియా గాంధీ
- December 09, 2024
సోనియా గాంధీ.. పుట్టింది ఇటలీలోనైనా, భారతదేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. శతాబ్దం పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాలిక అధ్యక్షురాలిగా వ్యవహరించిన ఘనత ఓ మహిళగా సోనియా సొంతం. పార్టీ అత్యున్నత స్థాయిలో ఉన్నా, నేడు ఒడిదుడుగుల్ని ఎదుర్కొంటున్న మొక్కవోని దీక్ష కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ, అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా నేటికీ పార్టీకి పూర్వవైభవం కలిగించాలనే అకుంటిత దీక్షతో పనిచేస్తున్న మహిళా నేత. నేడు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకురాలు సోనియా గాంధీ 78వ జన్మదినం.
సోనియా గాంధీ అసలు పేరు ఆంటోనియా మాయినో.1946, డిసెంబర్ 9న ఇటలీలోని లూసియానా దగ్గర ఉన్న కంట్రడా మెయిని గ్రామంలో స్టిఫెనో, పోలా మైనో దంపతులకు జన్మించారు. 1964లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువు నిమిత్తం ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ వెళ్లారు. ఓ గ్రీక్ రెస్టారెంట్ లో 1965లో ఆమె రాజీవ్ గాంధీని ఆమె కలిశారు. వారిద్దరి మధ్య తోలి చూపులోనే ప్రేమానుబంధం ఏర్పడి పెళ్ళికి దారి తీసింది. 1968లో హిందూ సంప్రదాయం ప్రకారం రాజీవ్ గాంధీని వివాహామాడి ఇందిరా గాంధి కోడలిగా భారతదేశంలో అడుగుపెట్టింది. రాజీవ్ గాంధీ రాజకీయాల్లో అడుగుపెట్టేంత వరకు సోనియా గాంధీ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. రాజకీయాల్లో అసలు ఏ మాత్రం అనుభవం, ఆసక్తి లేని సోనియా, భర్త మరణాంతరం కూడా దాదాపు 7 సంవత్సరాలు పార్టీ పగ్గాలకు దూరంగానే ఉంది. కానీ, పరిస్థితులు ఆమెను రాజకీయాల వైపు నడిపించాయి.
భారతీయుడిని వివాహాం చేసుకున్నా కూడా ఆమెపై విదేశీ ముద్ర చెరిగిపోలేదు. 1983లో ఇటలీ పౌరసత్వాన్ని వదులుకున్నా కూడా ఆమెపై పడిన విదేశీ ముద్ర మాత్రం కొనసాగింది. 1999లో సొంత పార్టీలోని ముగ్గరు సీనియర్ నేతలైన శరద్ పవార్, పి.ఎ.సంగ్మాలు ఆమె విదేశీయతపై ప్రశ్నించిన తర్వాత వారు పార్టీ నుంచి వైదొలగడానికి సిద్ధమైంది. చివరికి, పార్టీలోని ముఖ్యమైన నాయకులంతా సోనియాకు మద్దతుగా నిలవడంతో అనతికాలంలోనే పార్టీ అధ్యక్షురాలిగా 1998లో ఎన్నికై, దాదాపు 22 సంవత్సారాలుగా పార్టీ ప్రతి ఒక్క అడుగుకు తానే బాధ్యత వహించింది.
ఆమె రాజకీయ ప్రయాణం మొదలు పెట్టె నాటికి దేశ రాజకీయాల్లో ఏకస్వామ్య పార్టీ పాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాలకు రాజకీయాలు శరవేగంగా మారిన పరిస్థితులకు తగినట్టు, సోనియా రాజకీయ నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీని కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది భారత దేశాన్ని ప్రబల ఆర్థిక శక్తిగా ప్రపంచం ముందు నిలిపే ఉద్దేశంతో ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ను ప్రధానిగా నియమించారు.
2004, 2009 ఎన్నికలలో అఖండ విజయాన్ని అందుకున్న సమయంలో సోనియా ప్రధానిగా పదవి చేపడుతోందని ప్రచారం జరిగింది. పార్టీ నుండి సంపూర్ణ మద్దతు ఉన్నా కూడా, తను విదేశీయురాలనే ముద్ర తిరిగి తెరపైకి తెచ్చాయి ప్రతిపక్షాలు. అలాంటి సమయంలో సంపూర్ణ మెజారిటీ ఉన్న సోనియా ప్రధానికి అర్హురాయుండి కూడా పార్టీ వైపు తన వల్ల ఎవరూ వేలెత్తి చూపకూడదనే కారణంతో ఆర్థక తత్వ వేత్త మన్మోహన్ సింగ్ ని ప్రధానిగా చేశారు. కేవలం ఒక్కసారి కాదు, రెండు సార్లు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. భారతదేశ ప్రధాని పదవి సైతం తనకు కేవలం తృణ ప్రాయంగా వదిలేసింది.
2009 కాలంలో అమెరికా లాంటి శక్తులు కూడా ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటే, కేవలం ఇండియా మాత్రమే ఆ ఆర్థిక సంక్షోభానికి గురికాకుండా నిలబడింది. ఈ రోజు ఇండియా ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది అంటే, అది ఆనాటి ప్రధానిగా మన్మోహన్ సింగ్ పాలన దక్షత, సోనియా గాంధీ దార్శనికత కూడా పనిచేశాయని చెప్పాలి. డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ ‘123 అణు ఒప్పందాన్ని’ తీసుకువస్తే బీజేపీతో సహా, యుపీఏలో భాగస్వాములైన వామపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. కమ్యూనిస్టులు ప్రభుత్వానికి మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు. అయినా ఒప్పందాన్ని అమలు పరచి, ఇండియాను అణుశక్తి రంగంలో స్వావలంబన దిశగా నిలబెట్టడంలో సోనియా కీలక పాత్ర ఉన్నది.
యూపీఏ హాయాంలో ‘మహాత్మా గాంధీ జాతీయ పనికి ఆహార పథకం ’ దేశంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు పని కల్పించింది. ‘ఆధార్ ’ ప్రవేశపెట్టి సంస్కరణలకు సోనియా గాంధీ నాంది పలికారు. ఆ రోజుల్లోనే మహిళా రిజర్వేషన్స్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టి, మహిళా సాధికారతకు బీజాలు వేశారు. యుపీఏ కూటమి చైర్ పర్సన్గా క్రియాశీలక పాత్ర వహించి, నాటి లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు, తెలంగాణ చిన్నమ్మగా సుపరిచితమైన భాజపా నేత సుష్మా స్వరాజ్ మద్దతుతో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేశారు. తన అత్తగారైన మాజీ ప్రధాని ఇందిరమ్మ ఎలా అయితే తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోయారో, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆపద్బాంధవిగా సోనియమ్మ వారి మనస్సులో చిరస్థాయిగా నిలిచారు.
ప్రస్తుత పరిస్థితల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త ఒడిదుడుగుల్ని ఎదుర్కోంటున్న మాట నిజమే. సొంత పార్టీ నేతలు సైతం క్షేత్ర స్థాయి ప్రక్షాళన కావాలంటూ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కూడా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నందుకు సోనియాపై విమర్శులు కూడా వచ్చాయి. కానీ కష్ట సమయంలో అధ్యక్ష పదవి నుండి తొలగి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదనేది సోనియా ఉద్దేశం అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పార్టీకి తన అవసరం ఉందని, అన్ని పరిస్థితులను చక్కబెట్టడానికి సోనియా చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.
భారతదేశం లోని అతికొద్ది మంది మహిళా రాజకీయ వేత్తలలో సోనియాగాంధి పేరు ముందువరసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇటలీలో పుట్టి, అమెరికాలో పెరిగి, భారతదేశ ప్రధానికి కోడలిగా అడుగుపెట్టి తనదైన మార్క్ రాజకీయంతో పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టింది. ఆనాటి నుండి నేటి వరకు పార్టీ పురోగతైనా, తిరోగతైనా అన్నింటికీ బాధ్యత వహిస్తూ, ఏటికి ఎదురీదుతున్న పార్టీ పగ్గాలను వదలకు తీరం చేర్చడానికి సోనియా ప్రయత్నాన్ని అభినందించవచ్చు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకునే మహిళలకు ఆదర్శంగా నిలుస్తూనే ఉన్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







