ఖతార్‌ పెట్రోలియంలో కలిసిన తస్వీక్‌

- June 26, 2016 , by Maagulf
ఖతార్‌ పెట్రోలియంలో కలిసిన తస్వీక్‌



ఖతార్‌ పెట్రోలియం, తమ కుటుంబంలో తస్వీక్‌ చేరడాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోనే ప్రముఖ జాతీయ చమురు కంపెనీగా వృద్ధి చెందడం, అలాగే సుపీరియర్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోడక్టులు మరియు సర్వీసుల్ని చమురు - గ్యాస్‌ వాల్యూ చెయిన్‌లో అందించే దిశగా ఈ కలయిక ఉపయోగపడుతుందని ఖతార్‌ పెట్రోలియం వర్గాలు చెప్పాయి. అంతర్జాతీయ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే ఈ కలయిక ముఖ్య ఉద్దేశ్యమని క్యుపి (ఖతార్‌ పెట్రోలియం) వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి, తమ సంస్థలోకి తస్వీక్‌ ఉద్యోగులు, ఆస్తులు, కస్టమర్‌ రిలేషన్‌షిప్స్‌ అన్నీ ట్రాన్స్‌ఫామ్‌ అవుతాయని క్యుపి తెలిపింది. ఖతార్‌ పెట్రోలియం ప్రెసిడెంట్‌ మరియు సిఇఓ సాద్‌ షెరిదా అల్‌ కాబి మాట్లాడుతూ, తస్వీక్‌ - క్యుపిలో చేరడం ద్వారా తమ సామర్థ్యం మరింత పెరిగిందనీ, మార్కెట్‌లో తాము మరింత వేగంతో దూసుకుపోతామనీ, ఇది క్యుపి వాల్యూని పెంచమే కాకుండా, ఖతార్‌కి కూడా సరికొత్త గుర్తింపునిస్తుందని చెప్పారు. పూర్తిగా క్యుపి - తస్వీక్‌ విలీనం జరిగేదాకా తస్వీక్‌ మేనేజ్‌మెంట్‌ మరియు ఉద్యోగులు తమ డే టు డే అపరేషన్స్‌ యధావిధిగా కొనసాగిస్తారని, వినియోగదారులు, సప్లయర్స్‌, పార్టనర్స్‌తో సంబంధాలు కలిగి ఉంటారని క్యుపి వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com