దుబాయ్ లో 77 డెలివరీ మోటార్‌సైకిల్స్ సీజ్, ఫైన్..!!
- December 13, 2024
దుబాయ్: దుబాయ్ లో నిబంధనలు పాటించని డెలివరీ మోటార్‌సైకిళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం నిరంతరం తనిఖీలను చేపడుతున్నట్టు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. తనిఖీల సందర్భంగా 1,200 కంటే ఎక్కువ జరిమానాలను జారీ చేసినట్టు తెలిపింది. ఇందులో అసురక్షిత డ్రైవింగ్, రక్షణ గేర్ ధరించకపోవడం, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించినట్టు అథారిటీ పేర్కొంది.
హెస్సా స్ట్రీట్, జబీల్ స్ట్రీట్, జుమేరా స్ట్రీట్, డౌన్‌టౌన్, మిర్డిఫ్, మోటార్ సిటీ తదితర పట్టణ ప్రాంతాలలో తనిఖీలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా బీమా, రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన 44 మోటార్‌సైకిళ్లను సీజ్ చేశారు. దాంతోపాటు అవసరమైన అనుమతులు లేని33 ఎలక్ట్రిక్ బైక్‌లను సీజ్ చేసినట్టు అథారిటీ లైసెన్సింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ డైరెక్టర్ సయీద్ అల్ రామ్సీ తెలిపారు.
తాజా వార్తలు
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!







