రియాద్ లో అంతర్జాతీయ కాఫీ, చాక్లెట్ ఎక్స్పో ప్రారంభం..!!
- December 13, 2024
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో అంతర్జాతీయ కాఫీ, చాక్లెట్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఇందులో 350కి పైగా స్థానిక, విదేశీ సంస్థలు పాల్గొంటున్నాయి. డిసెంబర్ 15 వరకు జరిగే ఈ ఈవెంట్లో కాఫీ, చాక్లెట్ పరిశ్రమలలో తాజా ఆవిష్కరణలు, పురోగతిని ప్రదర్శించేందుకు 40 దేశాల నుండి ప్రతినిధులు తరలివచ్చారు.
ఈ వార్షిక ఈవెంట్.. ప్రపంచంలోని ప్రధాన ప్రత్యేక ప్రదర్శనలలో ఒకటిగా గుర్తింపుపొందింది. ఈ సందర్భంగా చాక్లెట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు-పరిష్కారాల కోసం చర్చా ప్యానెల్లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో కాఫీ, చాక్లెట్ రంగాలలో ప్రొఫెషనల్ ట్రైనర్లు ప్రత్యేక శిక్షణా కోర్సులను అందిస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలను పెంపొందించడం ఈ ఈవెంట్ లక్ష్యమని నిర్వాహకులు ప్రకటించారు. సౌదీ అరేబియా కాఫీ వినియోగంలో అగ్ర అరబ్ దేశాలలో ఒకటిగా ఉంది. ఆసియాలో పదవ స్థానంలో ఉంది. ఈ ప్రదర్శన కాఫీ-సంబంధిత వాణిజ్యం, ఆవిష్కరణలకు కేంద్రంగా సౌదీ అరేబియా స్థానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







