బర్కాలో స్పెర్మ్ వేల్ మరణానికి సహజ పరిస్థితులే కారణం..!!
- December 13, 2024
బర్కా: బర్కాలోని విలాయత్‌లోని అల్ సవాడి ప్రాంత తీరంలో ఇటీవల స్పెర్మ్ తిమింగలం మరణించడం సహజ పరిస్థితుల వల్ల సంభవించినట్లు ఎన్విరాన్‌మెంట్ అథారిటీ ధృవీకరించింది. తీరానికి కొట్టుకువచ్చిన తిమింగలం 15 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉందని తెలిపారు. శవపరీక్షలో దాని మృతదేహంలో అనేక పరాన్నజీవుల ఉనికిని చూపించిందని, జంతువు వ్యాధితో బాధపడుతోందని అధికార యంత్రాంగం నివేదించింది. ప్రస్తుతం సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ (ఎస్‌క్యూయూ) ప్రయోగశాలలో తిమింగలం శరీర నమూనాలను విశ్లేషిస్తున్నట్లు అథారిటీ తెలిపింది. 55 నిరంతర పని గంటల పాటు శ్రమించిన టీమ్ మెంబర్స్ అవసరమైన నమూనాలను సేకరించింది. అనంతరం వివిధ సంస్థల సహకారంతో తిమింగలాన్ని ఖననం చేశారు. స్పెర్మ్ తిమింగలాలు ఒమన్ సముద్రం, అరేబియా సముద్రం లోతైన నీటిలో ఉంటాయని, స్పెర్మ్ వేల్ 18 మీటర్ల పొడవు పెరుగుతుందని, 57,000 కిలోగ్రాముల బరువు ఉంటుందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు







