స్విగ్గీ కొత్త యాప్..
- December 16, 2024
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ కొత్తతరహా సేవల్ని శ్రీకారం చుట్టింది.ఇప్పటికే క్విక్ కామర్స్ విభాగంలో రాణిస్తున్న సంస్థ తాజాగా.. డైనింగ్, లైవ్ ఈవెంట్లు, టికెట్ బుకింగ్ రంగంలో ప్రవేశించడానికి సిద్ధమైంది.దీని కోసం Scenes పేరిట ప్రత్యేక యాప్ను తీసుకొచ్చింది. ఇప్పటికే జొమాటో..డిస్ట్రిక్ట్ పేరిట కొత్త యాప్ను తీసుకొచ్చింది.ఈ అప్లికేషన్ ద్వారా టికెట్ బుకింగ్, డైనింగ్ తరహా సేవలు అందిస్తోంది.ఈ విభాగంలో తన సత్తా చాటుకొనేందుకు స్విగ్గీ ముందుకొచ్చింది. అందులోభాగంగానే తాజాగా Scenes అప్లికేషన్ను లాంచ్ చేసింది. దీని సాయంతో పార్టీలు, లైవ్ మ్యూజిక్, డీజే నైట్స్, పార్టనర్ రెస్టరంట్లలో జరిగే మరిన్ని ఈవెంట్ల కోసం టికెట్లు బుక్ చేసుకోవచ్చు.దీంతో పాటు అనేక సదుపాయాలు ఈ కొత్త యాప్లో ఉన్నాయని స్విగ్గీ చెబుతోంది. అయితే డిస్ట్రిక్ట్ యాప్ తరహా సినిమా టికెట్లను విక్రయించే సదుపాయం ఇందులో లేదని స్పష్టం చేసింది.ఈ కొత్తతరహా సదుపాయం ద్వారా స్విగ్గీ ఆదాయం పెరుగుతుందని, యూజర్ల సంఖ్యను పెంచుకోవడంలో సాయపడుతుందని ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ తెలిపింది. తొలుత ఈ సేవలు బెంగళూరులో ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు