ఏపీ నుండి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం
- December 16, 2024
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, సానా సతీష్ సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ఈరోజు ఉదయం వారితో చైర్మన్ జగదీప్ దన్ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభ ఉప ఎన్నిక ఇటీవల జరిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో వీరు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు 164 స్థానాలను కైవసం చేసుకున్నాయి.దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







