బలగం మూవీ సింగర్ మొగులయ్య అనారోగ్యంతో కన్నుమూత
- December 19, 2024
హైదరాబాద్: జానపద కళాకారుడు మొగులయ్య, బలగం మూవీలో తన గాత్రంతో ప్రేక్షకుల హృదయాలను కదిలించిన వ్యక్తి అనారోగ్యంతో కన్నుమూశారు. మొగులయ్య కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ, వరంగల్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. మొగులయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కానీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన మరణించారు. మొగులయ్య మరణం జానపద కళారంగానికి తీరని లోటు.
మొగులయ్య తన గాత్రంతో బలగం సినిమాలో క్లైమాక్స్ సాంగ్‌ను అద్భుతంగా ఆలపించి, ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. ఈ పాటతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మొగులయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండటంతో, ఆయన సతీమణి కొమురమ్మ సాయం కోసం ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మొగులయ్య మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మొగులయ్య వంటి ప్రతిభావంతుల కళాకారులు మన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాం.
--వేణు_పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







