బాధిత ప్రవాస మహిళలకు మరింత సహాయం అందించాలి: UN పిలుపు

- December 20, 2024 , by Maagulf
బాధిత ప్రవాస మహిళలకు మరింత సహాయం అందించాలి: UN పిలుపు

యూఏఈ: లింగ సమానత్వాన్ని సమర్థించడం, మహిళలను రక్షించడం వంటి యూఏఈ రికార్డుపై UN ఉన్నత స్థాయి అధికారి స్పందించారు. బాధిత మహిళలను సురక్షితంగా ఉంచడంలో దేశం సహాయపడగలదని విశ్వసిస్తున్నట్లు అమే తెలిపారు. మహిళలు, బాలికలపై హింసపై UN ప్రత్యేక ప్రతినిధి అయిన రీమ్ అల్సలేం..సమాజంలో మహిళల పూర్తి భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి దేశం ఎలా జాతీయ ప్రాధాన్యతనిచ్చిందో పేర్కొన్నారు. మహిళల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో పురోగతి ఉన్నప్పటికీ, మహిళలు బాలికలపై హింసను నిరోధించడంలో, ప్రతిస్పందనను మెరుగుపరచడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధికారులు గుర్తించారని తెలిపారు. 
హింసకు గురైన ప్రవాస మహిళలకు మరింత మద్దతు ఇవ్వాలని అల్సలేం పిలుపునిచ్చారు.
 బాధితులకు యూఏఈ అనేక మద్దతు ఛానెల్‌లు, చట్టపరమైన సహాయం, ఆశ్రయ సేవలను అందిస్తోందని, ఈ ప్రవాస మహిళలు మరింత స్పష్టమైన సహాయం నుండి కూడా ప్రయోజనం పొందవచ్చని సూచించారు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థిక మద్దతు వంటి కొన్ని రకాల సేవలలో భారీ వ్యత్యాసాన్ని ఉన్నాయని అల్సలేమ్ చెప్పారు. అన్ని జాతీయతలకు చెందిన అటువంటి మహిళలకు సహాయపడే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నప్పటికీ, సహాయం పరిమితంగా ఉందని, అధికారిక విధానాలు మరియు మార్గాల ద్వారా మరింత మద్దతు అందించాలని సిఫార్సు చేస్తూ అల్సలేమ్ చెప్పారు. ప్రత్యామ్నాయ ఎంపికలు ఉండాలన్నారు. వారు యూఏఈ లో ఉండటానికి హక్కును పరిగణించాలని, అలాగే వారి జీవితాలను ఇక్కడ కొనసాగించడానికి వారికి తగిన మద్దతును అందించాలని ఆమె చెప్పింది.
తన 10-రోజుల పర్యటనలో యూఎన్ ప్రత్యేక ప్రతినిధి అనేక ఎమిరేట్స్‌ లలో సందర్శించారు. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు అంతర్జాతీయ సంస్థలు, కమ్యూనిటీస్, విద్యావేత్తలు, ప్రైవేట్ వ్యాపారాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జూన్ 2025లో UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు అల్సలేం తన పర్యటనపై పూర్తి నివేదికను అందజేస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com