పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- December 24, 2024
న్యూ ఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బీహార్, ఒడిశా, మిజోరం, కేరళ, మణిపూర్ రాష్ట్రాల గవర్నర్లు మారారు.
- ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
- ప్రస్తుత మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు.
- మిజోరాం గవర్నర్‌గా జనరల్ వీకే సింగ్ నియమితులయ్యారు.
- కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
- మణిపూర్ గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లా నియమితులయ్యారు.
- బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళకు బదిలీ అయ్యారు.
ఈ గవర్నర్ల నియామకాలు వారు సంబంధిత కార్యాలయాలకు బాధ్యతలు స్వీకరించిన తేదీల నుండి అమలులోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







