భారతీయుడి మిస్సింగ్ కేసు విషాందాంతం.. మృత దేహం భారత్కు తరలింపు..!!
- December 25, 2024
కువైట్: భారతీయుడి మిస్సింగ్ కేసు విషాందాంతమైంది. తప్పిపోయిన తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన భారతీయ జాతీయుడు కుమరేశన్ పెరుమాళ్ డిసెంబరు 16వ తేదీన అబు హలీఫా ప్రాంతంలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో మృతి చెందాడని అధికారులు తెలిపారు.
తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త తెలిపిన వివరాల ప్రకారం.. కుమరేసన్ కువైట్లోని అల్-ధౌ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్ట్ కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కుమరేసన్ తప్పిపోవడంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. సాయం అందించాలని సామాజిక కార్యకర్త శ్రీను సంప్రదించారు. అతను 16 డిసెంబర్ 2024 నుండి కంపెనీ వసతి గృహం నుండి తప్పిపోయినట్లు గుర్తించారు. కువైట్లోని ఆసుపత్రులను సంప్రదించిన తరువాత, వారు అబు హలీఫాలో వాహన ప్రమాదంలో కుమరేసన్ పెరుమాళ్ మరణించినట్లు ధృవీకరించారు. 24 గంటల్లో అన్ని లాంఛనాలను పూర్తి చేసి, మృత దేహాన్ని కువైట్ ఎయిర్వేస్ ద్వారా డిసెంబర్ 24న త్రివేండ్రంకు తరలించారు. కుమరేశన్ గత సంవత్సరం మాత్రమే పని కోసం కువైట్కు వచ్చాడని, అతనికి భార్య రంజని, ఏడాదిన్నర బాలుడు ప్రాణేష్ తంగా ఉన్నాడు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







